చిరు " విశ్వంభర " పై క్రేజీ అప్డేట్..!
ఈ సినిమాపై ఇప్పటికే మెగాస్టార్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో 1506వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగారు పొందుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ విషయంలో అయితే మెగా ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అప్డేట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తజగందుతున్న సమాచారం ప్రకారం చిరు అలాగే యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ నడుమ కొన్ని కీలక సన్నివేశాలని దర్శకుడు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఈ సీక్వెన్స్ సీన్ కీలకంగా మారుతుందని టాక్.
ఇక ఈ భారీ సినిమాని విజువల్ వండర్ లాగా రూపొందిస్తుండగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10కి సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు కన్ఫామ్ చేశారు. ప్రజెంట్ వరుస ఫ్లాప్ లతో ఉన్న చిరు ఈ సినిమా తో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. భోళ శంకర్ వంటి డిజాస్టర్ల మధ్యలో ఉన్నాడు చిరంజీవి. విశ్వంభర సినిమా కనుక సూపర్ హిట్ అయితే చిరు కెరియర్ మరికొన్ని సంవత్సరాలు పెరుగు చూసుకో అవసరం లేదని చెప్పుకోవచ్చు.