వామ్మో: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి ఆ స్టార్ హీరో సినిమా అంటే అంత పిచ్చా..!
గతంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఒక సినిమా రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి ఇష్టమైన విషయాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది. ఈ జనరేషన్ లో గొప్ప నటుడుగా పేరుపొందిన వారిలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు అని.. ఈయన నటించిన పిల్ల జమిందార్ సినిమా అంటే తన భార్యకు చాలా ఇష్టం అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశారు.
ఆమె వల్ల తాను కూడా ఎన్నోసార్లు పిల్ల జమిందార్ చిత్రాన్ని చూడవలసి వచ్చింది అంటు ఎన్టీఆర్ తెలియజేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని ఎన్టీఆర్ తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి మాత్రం ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పరిచింది. ఆ తర్వాత మహానటి చిత్రంతో తన స్టామినా చూపించిన డైరెక్టర్ ప్రస్తుతం కల్కి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు పొందారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ భార్యకు ఎన్టీఆర్ సినిమాల తరువాత నాని సినిమాని ఎక్కువ ఇష్టమని తెలిపింది.