కల్కి ఓ చెత్త సినిమా అంటున్న బాలీవుడ్ క్రిటిక్?
ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకొక 36 కోట్లు వసూళ్లు చేస్తే సరిపోతుంది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ మూవీ ఇప్పటిదాకా 720 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ మీడియా కల్కి సినిమా మీద విమర్శలను చేస్తు ఏడుస్తూ ఉంది. తెలుగు సినిమా బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేస్తున్న క్రమంలో మన తెలుగు సినిమాలను ఎలాగైనా సరే తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశ్యం తోనే బాలీవుడ్ మీడియా ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడుతూ ఉంటుందనే విషయం దేశం మొత్తం తెలిసిందే. ఇక అందులో భాగంగానే బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే కేఆర్ కే (కమల్ ఆర్ ఖాన్) అనే వ్యక్తి మరోసారి కల్కి సినిమా మీద భారీ విమర్శలను చేస్తున్నాడు. రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా కల్కి సినిమా కంటే 20 రెట్లు బెటర్ అని అతను కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.