కల్కి 2898 AD : వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఎంత వచ్చిందో తెలుసా..?
ఈ మూవీ కి 7 రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 67.01 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 15.52 కోట్లు , ఉత్తరాంధ్రలో 15.58 కోట్లు , ఈస్టు లో 9.22 కోట్లు , వెస్ట్ లో 6.82 కోట్లు , గుంటూరు లో 8.48 కోట్లు , కృష్ణ లో 8.29 కోట్లు , నెల్లూరు లో 4.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 7 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 135.32 కోట్ల షేర్ ... 210.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 7 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక లో 22.45 కోట్లు , తమిళ నాడు లో 13.75 కోట్లు , కేరళలో 7.25 కోట్లు , హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 79.60 కోట్లు , ఓవర్ సీస్ లో 85.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో 343.92 కోట్ల షేర్ ... 660.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవేన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 28.08 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.