ఇది కదా క్రేజీ కాంబినేషన్ అంటే.. ఆ డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా?
అయితే విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. మొన్నటికి మొన్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి విశ్వక్ చేసిన ప్రతి సినిమా కూడా ఇక ప్రేక్షకులకు నచ్చేస్తూ ఉంది రొటీన్ కాకుండా భిన్నంగా సినిమాలు చేస్తూ సక్సెస్ రూట్ లో ముందుకు సాగుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో ఒక క్రేజీ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నాడట.
కామెడీ ఓరియంటెడ్ సినిమాలను తనకు మించి ఇంకెవరు తీయలేరు అని నిరూపించుకున్న డైరెక్టర్ అనుదీప్. జాతి రత్నాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో డాన్ అనే సినిమా తీసి మరోసారి హిట్టు కొట్టాడు ఇక ఇప్పుడు విశ్వక్సేన్ తో అటు అనుదీప్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుదీప్ చెప్పిన కథకు విశ్వక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మించబోతున్నారట. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం విశ్వక్సేన్ అటు లైలా తో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు.