సమంత పై ఫైర్ అయినా ఆ డాక్టర్..?
పాడ్ కాస్ట్ లో మాట్లాడే వారికి అసలు లివర్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. సైన్స్ గురించి ఏం తెలియని ఇద్దరు వ్యక్తులు వారి అజ్ఞానాన్ని పంచుకుంటున్నారు. అతను డాండలియన్ అనే మొక్క కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని చెప్తున్నాడు. నేను పదేళ్లుగా లివర్ స్పెషలిస్ట్ గా చేస్తున్న అనుభవంతో వారి వాదనను పూర్తిగా ఖండిస్తున్నాను. డాండలియన్ అనేది కేవలం మూత్ర విసర్జనను ప్రేరేపించేందుకు వెనుకటికి ఔషదాల్లో వాడేవాళ్లు. అసలు డాండలియన్ మనుషుల ఆరోగ్యానికి మంచిది అని ఎక్కడా నిర్ధారణ కాలేదు. దానివల్ల వేరే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటూ చెప్తుంటారు. కానీ, దాని మీద విస్తృత స్థాయిలో పరిశోధన జరగాలి. ఎలుకల్లో ఇది మంచి ఫలితాలు ఇచ్చినట్లు చూపించినా.. దాని నుంచి మనుషుల్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అనే విషయం పూర్తిగా తెలియదు కాబట్టి డాండలియన్ ను మనుషులకు రికమెండ్ చేయకూడదు” అంటూ ఆ లివర్ స్పెషలిస్ట్ తన ఎక్స్.కామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.ఆ డాక్టర్ తమ అభిమాన హీరోయిన్ ని అలా అనగానే సమంత ఫ్యాన్స్ అంతా ఆగ్రహంతో రగిలిపోయారు. డాండలియన్ కి సంబంధించిన సైన్టిఫిక్ రిపోర్ట్స్ అంటూ స్క్రీన్ షాట్స్ పెట్టారు. అయితే ఫ్యాన్స్ ని కూడా ఆ వైద్యుడు ఒక ఆట ఆడుకున్నాడు. ముందు మీరు మనుషులా? ఎలుకలా? తేల్చుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చాడు. మీరు ఈ విషయాన్ని మరీ పర్సనల్ గా తీసుకుని హీరోలు అయిపోవాలి అని చూడొద్దు అంటూ హితవు పలికాడు. ఇది ఫీల్డ్ కాదు.. ఇది సైన్స్ అంటూ చురకలు అంటించాడు. ప్రస్తుతం ఈ లివర్ డీ టాక్సిఫికేషన్, సమంత కామెంట్స్, డాక్టర్ కౌంటర్స్, ఆ పాడ్ కాస్ట్ వీడియో అన్నీ వైరల్ అవుతున్నాయి.