అక్రమ సంబంధమే లావణ్యని వదిలెయ్యడానికి కారణమంటున్న రాజ్ తరుణ్?
తాజాగా ఈ విషయం పై హీరో రాజ్ తరుణ్ స్పందిస్తూలావణ్యను నేను మోసం చేయలేదు. తానే నన్ను మోసం చేసిందంటూ రాజ్ తరుణ్ ప్రకటించిన విషయం తెలిసొందే. తాజాగా మరిన్ని సంచలన విషయాలను మీడియా ముందు రాజ్ తరుణ్ వెల్లడించాడు.తాను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మొదట సహయం చేసింది లావణ్యనే. అందుకే తాను నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకున్నాను.ఎప్పుడైతే లావణ్య డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పుడే తన లిమిట్స్ తను దాటిపోయింది. నేను సిగరెట్ మద్యం తీసుకుంటాను కానీ డగ్స్ ఎప్పుడు తీసుకోలేదు. లావణ్యకు నా డబ్బులు కావాలి అందుకే ఇలాంటి స్టోరీలు అల్లుతుంది. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు రిలేషన్ ఉంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నారు. లావణ్యతో నేను 2017 నుంచి దూరంగా ఉంటున్నాను. లావణ్యకు నాకు 7 ఏళ్ల నుంచి శారీరకంగా సంబంధం లేదు. నా పరువు పోతుందనే ఇన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్నాను. లావణ్య మోసం చేసింది కాబట్టే మస్తాన్ సాయి ఆమెపై కేసు పెట్టాడు.నటి మాల్వి మల్హోత్రాపై లావణ్య చేస్తున్న వార్తలు ఆవాస్తవం. మాల్వి మల్హోత్రా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మాల్వి మల్హోత్రా నేను కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించాం. ఆ సినిమా వరకే మా రిలేషన్. లావణ్య కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తుంది అంటున్నారు రాజ్ తరుణ్.