'కల్కి'లో ప్రభాస్ కాకుండా.. ఆ హీరో నటించి ఉంటే చరిత్ర తిరగరాసేదట?
మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న ఈ మూవీ ఇక ఇటీవల 800 కోట్లకు పైగా వసూళ్లను క్రాస్ చేసేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాస్తుంది అని చెప్పాలి. అయితే కల్కి మూవీలో ప్రభాస్ భైరవ పాత్రలో అదరగొట్టేసాడు. కామెడీ ఎమోషన్స్ యాక్షన్ ఇక అన్ని విభాగాలను ఇరగదీసాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ కాకుండా మరో హీరో కల్కి మూవీలో నటించి ఉంటే మరింత పెద్ద హిట్ అయ్యేది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
ఏకంగా భైరవ పాత్రలో ప్రభాస్ కంటే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే బాగుండేది అని కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారట. ఏకంగా తారక్ నటించి ఉంటే 1200 కోట్ల వసూలు దాటేసి ఉండేదని చెబుతున్నారట. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకేకుతున్న వార్ 2 సినిమాలోను నటిస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఇక ఇప్పుడు కల్కి సినిమాలో తారక్ నటిస్తే మరింత బాగుండేది అని వార్తలు ప్రచారం అవుతున్నాయ్. దీంతో ఏ హీరో చేయాల్సిన సినిమా ఆ హీరో చేస్తేనే బాగుంటుందని మరి కొంతమందిని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.