వావ్: ఒక్క ఏడాదిలోనే ఫాన్స్ తలెత్తేలా చేసిన ప్రభాస్.. రికార్డ్ ఎవరు చేరుపలేరుగా..?
అలాగే ఆది పురుష్ చిత్రంలో త్రేతా యుగం నాటి రాముడు కథతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక సలార్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ని సైతం చూపించడం జరిగింది. కల్కి సినిమాలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే విషయాన్ని కూడా చూపించారు ప్రభాస్ ఇలా సరికొత్త సినిమాలతో ప్రభాస్ అభిమానులను సైతం కాలరెత్తుకునేలా చేస్తూ ఉన్నారు. అయితే ఒక సంవత్సరం గ్యాప్ లోనే ప్రభాస్ భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి సంబంధించి సినిమాలను చూపించడంతో ఇలా చూపించడం కేవలం తమ హీరోకే సాధ్యమవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
2023 జోన్ లో ఆది పురుష్ విడుదల అవ్వగా పాస్టులో జరిగిన రాముడు కథ ఇది ఆ తర్వాత 2023 డిసెంబర్లో సలార్ సినిమాని చూపించారు. ఇప్పుడు 2024 జూన్ లో కలియుగం చివరిలో ఎలా ఉంటుంది. రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చూపించడం జరిగింది. ఇలా సంవత్సరం ప్రభాస్ ప్రజెంట్, పాస్ట్ ,ఫ్యూచర్ కి సంబంధించి ప్రభాస్ తన చిత్రాలలో చూపించడం జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్ హవా ఇప్పుడు ఎక్కువగా నడుస్తూనే ఉంది. స్టార్ హీరో అయ్యి ఉండి కూడా పూర్తిగా కమర్షియల్ సినిమాలను చేయకుండానే ప్రయోగాలతో కూడా ముందుకు వెళుతున్నారు.