కల్కికి బ్రహ్మరథం పడుతున్న అమెరికా?

Purushottham Vinay

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 371 కోట్ల షేర్, 742 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇక అమెరికాలో కల్కి రిలీజ్ ముందు నుంచే సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.ఇప్పటి వరకు కల్కి సినిమా అమెరికాలో ఏకంగా 14.6 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.  అంటే దాదాపు మన లెక్కల్లో 116 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో తెలుగు సినిమాలకు మార్కెట్ ఎక్కువే. అక్కడ 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధిస్తేనే చాలా గొప్పగా చెప్పుకుంటారు. అందుకే చాలా తెలుగు సినిమాలు అక్కడ సరికొత్త రికార్డులు సృష్టించాయి కలెక్షన్స్ విషయంలో. అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో 20 మిలియన్ డాలర్స్ తో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది.ఇప్పుడు కల్కి ఈ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ అయ్యి ఈ సినిమా క్లీన్ హిట్ అయ్యి లాభాల్లోకి వచ్చేసింది. 


 'కల్కి 2898 ఏడీ' సినిమాకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి మొత్తం రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.చాలా వేగంగా ఈ సినిమా 1000 కోట్ల వైపు దూసుకుపోతుంది.600 కోట్ల భారీ బడ్జెట్ తో కల్కి 2898 ఏడి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు.ఈ సినిమా రెండో భాగం కూడా రూపొందుతోందని, అందులో 60 శాతం పూర్తయిందన్న వార్త కూడా వినిపిస్తోంది. రెండో భాగంలో కొన్ని ముఖ్యమైన సీన్లను మాత్రం ఇంకా పూర్తిచేయాల్సి ఉందంటున్నారు. చాలా వరకు పూర్తయిపోయందనే అంటున్నారు.కల్కి 2898 ఏడి చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. దిశా పఠాని గ్లామర్ రోల్ లో బాగా మెప్పించింది. పార్ట్ 2 ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: