అనుపమ అలాంటి డిసిషన్ తీసుకోవడం వెనక అంత పెద్ద స్టోరీ ఉందా.. ఇది తెలియక అభిమానులంతా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యువ నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈమె మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె నితిన్ హీరోగా రూపొందిన "అ ఆ" అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఈమె పల్లెటూరి అమ్మాయిల క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు ఎక్కువ శాతం ఇలాంటి పాత్రలే వచ్చాయి.

ఈమె కూడా కెరియర్ ప్రారంభంలో పెద్దగా గ్లామర్ షో చేయకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమెను ఇలాగే చూడడానికి ఇష్టపడ్డ ఎంతో మంది ప్రేక్షకులు ఈమెకు అభిమానులు అయ్యారు. ఇది ఇలా ఉంటే అనుపమ "రౌడీ బాయ్స్" మూవీ దగ్గర నుండి భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. రౌడీ బాయ్ సినిమాలో అందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా కిస్ సన్నివేశాలలో కూడా పాల్గొంది. ఆ తర్వాత ఈమె టిల్లు స్క్వేర్ మూవీ లో కూడా భారీగా తన అందాలను ఆరబోసింది. ఈమె భారీ స్థాయిలో అందాలను ఆరబోయడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది.

ఎప్పుడు ఒకే రకం పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది. అలాగే తనలో ఉన్న నటిని కూడా బయటికి తీయడం కష్టం అవుతుంది. అందుకే డిఫరెంట్ పాత్రలు చేస్తున్నాను. కేవలం రొమాంటిక్ సన్నివేశాలు , స్కిన్ షో చేయడం నా ఉద్దేశం కాదు. ఏ రకం పాత్ర అయినా చేసి జనాలను ఆకట్టుకోవడమే ఒక నటి లక్షణం. అందుకే నేను అన్ని రకాలు అయినా పాత్రలు చేస్తున్నాను అని ఈమె వివరించండి. దీనితోనే ఈమె క్లాస్ , గ్లామర్ షో , వైవిధ్యమైన పాత్రలలోనూ ఏ రకమైన పాత్రలలోనైనా నటించడానికి రెడీగా ఉన్నట్లు అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: