కల్కి ఈ వీకెండ్ కీలకం.. లేదంటే కొన్ని ఏరియాల్లో భారీ ఎదురుదెబ్బ..?

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD  సినిమా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వాసులు చేసి హిట్టు స్టేటస్ ను అందుకుంది. కాకపోతే తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ సినిమా ఇప్పటికీ హిట్ స్టేటస్ ను అందుకోలేదు. ఇక నైజాం ఏరియాలో ఈ సినిమాకు దాదాపు 70 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమా ఇప్పటికే దాదాపు 70 కోట్ల మేర షేర్ కలెక్షన్ల రాబట్టింది. ఇక ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ క్లోజ్ అయ్యే సరికి నైజాం ఏరియాలో దాదాపుగా మరో 10 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానితో నైజాం ఏరియాలో ఈ మూవీ బిజినెస్ తో సంబంధం ఉన్నవారు లాభాలు పొందే అవకాశం ఉంది. కాకపోతే ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఈ సినిమా బిజినెస్ తో లింక్ అయిన కొంత మంది టెన్షన్ లో ఉన్నారు. ఈ మూవీ ఈ వీకెండ్ లో గట్టిగా కలక్షన్ రాబట్టే అవకాశం ఉంది. ఈ వీకెండ్ దాటితే మాత్రం ఈ సినిమా పెద్ద మొత్తంలో కలక్షన్ రాబట్టడం కష్టమే.

ఉత్తరాంధ్ర , గుంటూరు , నెల్లూరు సిడెడ్ లో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వచ్చిన ఈ ఏరియాలలో భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రాంతాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు అతి దగ్గరగా కూడా వెళ్లలేదు. దానితో ఈ వీకెండ్ పూర్తి అయ్యేలోపు ఈ సినిమా కనుక ఈ ఏరియాలలో మంచి కలక్షన్ రాబడితే ఓకే , లేదంటే ఆ తర్వాత ఈ సినిమాకి పెంచిన ధరలు కూడా తగ్గుతాయి. దానివల్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా ఈ ప్రాంతాలలో టచ్ చేసి అవకాశం ఉండదు. దానితో ఈ ప్రాంతాలలో ఈ సినిమా బిజినెస్ తో లింక్ అయిన వారికి నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: