కల్కి ఖాతాలో మరో రికార్డ్? అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం!
పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇక 9 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో ఏకంగా రూ. 431.55 కోట్ల వసూళ్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటి నుంచి తెలుగులో రూ. 24.1 కోట్లు, హిందీ నుంచి రూ. 171.9 కోట్లు, కన్నడ నుంచి 3 కోట్లు, మలయాళం ద్వారా రూ. 14.9 కోట్లుగా ఉన్నాయి. ఇక కల్కి సినిమాకు వరల్డ్ వైడ్గా 9 రోజుల్లో రూ. 800 కోట్లు వచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్ చూడటానికి అదిరిపోయింది. ఆ పోస్టర్ లో చుట్టూ ఉన్న ఫైర్లో ప్రభాస్ కనిపించిన తీరు అయితే ఇప్పుడు ఆకట్టుకుంది. అందువల్ల ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.