గత కొంత కాలంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండే ఆ సినిమాలను గనుక భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు అయితే అతి తక్కువ కాలంలోనే పెట్టిన డబ్బులను వెనక్కు రప్పించుకోవడం కోసం సినిమా యొక్క టికెట్ ధరలను పెంచుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో అనేక తెలుగు సినిమాలకు ఇలా టికెట్ ధరలను పెంచారు. తెలుగు సినిమాల హీరోలకు తెలుగులో క్రేజ్ ఉంటుంది కాబట్టి కాస్త టికెట్ ధరలను పెంచిన కూడా పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. సినిమాకు హిట్ టాక్ వస్తే మామూలు ప్రేక్షకులు కూడా ఎక్కువ ధర పెట్టి సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు.
వేరే భాష సినిమాలకు మన రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచిన సందర్భాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా మొదటి భాగం తక్కువ టికెట్ ధరల తోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ భారీ టికెట్ ధరలతో తెలుగు రాష్ట్రాలలో విడుదల అయింది. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూలు వచ్చాయి. ఇక ఇదే స్ట్రాటజీని భారతీయుడు 2 యూనిట్ కూడా పాటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే భారతీయుడు 1 సినిమా చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి తెలుగులో అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ మూవీ కి కొనసాగింపుగా భారతీయుడు 2 ను తెరకెక్కించారు. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను కాస్త పెంచి రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో భారతీయుడు 2 యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి భారతీయుడు 2 మూవీ ని తక్కువ టికెట్ ధరలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా ..? లేక పెంచిన టికెట్ ధరలతో తీసుకువస్తారా అనేది చూడాలి.