పుష్ప ప్రతినాయకుడి సినిమా ఓటీటీలో వచ్చేస్తొందోచ్!

Suma Kallamadi
పుష్ప సినిమా గురించి తెలుగు జనాలకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎటువంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఏకంగా మన హీరో అల్లు వారి వారసుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అది మాత్రమే కాదండోయ్... ఇంతకుముందు తెలుగు హీరోలలో ఎవరికీ సాధ్యం కానీ ఘనతను సాధించాడు. ఉత్తమ నటుడు కేటగిరీలో ఏకంగా నేషనల్ అవార్డు దక్కించుకున్నాడు మన ఐకాన్ స్టార్.
ఇక అసలు విషయంలోకి వెళితే... ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్ కి ఎంత పేరు వచ్చిందో... ప్రతి నాయకుడిగా చేసిన మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ కి కూడా అంతే పేరు వచ్చింది. ఇక పుష్ప సినిమా హిట్ కావడంతో చాలామంది పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. దానికో ముఖ్య కారణం లేకపోలేదు.
మొదటి భాగంలో ప్రతి నాయకుడు పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంటుంది. ఇక రెండవ పార్టులో ప్రతి నాయకుడు అయినటువంటి ఫాసిల్ పాత్రనిడివి ఎక్కువగా ఉండటం వలన తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో మన ప్రతి నాయకుడు మలయాళ సినిమాలను తెలుగులోకి అనువదించి విడుదల చేస్తున్నారు. అందులో దోమమ్ సినిమా ఒకటి. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తెలుగువారి కోసం అమెజాన్ ఓటిటిలోకి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఔత్సాహికులైన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూసి తరిస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. ఇకపోతే మన ప్రతి నాయకుడికి మన తెలుగులో మార్కెట్ కాస్త తక్కువ. దాంతో ఎలాగైనా తెలుగు మార్కెట్ ని కొల్లగొట్టాలని చూస్తున్నాడు మన హీరో. నిజమే కదా... మన తెలుగు హీరో అక్కడ కేరళలో దుమ్ము దులిపేస్తుంటే వారికి మాత్రం కుళ్ళుగా ఉండదా ఏమిటి? వారికి ఏమి తక్కువ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: