చిరు.. బాలయ్య.. నాగ్.. వెంకీ అందరి టార్గెట్ ఒకటే.. కానీ ఇప్పటికి కమిట్ అయింది ఇద్దరే..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ వీరంతా కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా తమ సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువ శాతం ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక విక్టరీ వెంకటేష్ కొన్ని రోజుల క్రితమే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనే ఉద్దేశం లోనే దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది.

ఈ మూవీ యొక్క విడుదల తేదీని ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించలేదు. కానీ ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే నాగర్జున ఇప్పటి వరకు ఏ సినిమాను ఓకే చేయలేదు. కాకపోతే ఏదైనా సినిమాను ఓకే చేసిన దానిని చాలా త్వరగా పూర్తి చేసి ఆ సినిమాను సంక్రాంతి కనుకగా విడుదల చేయాలి అని ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి ఈ నలుగురు కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి ని పెద్ద ఎత్తున టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: