ఛాన్స్ రావాలంటే.. కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. జబర్దస్త్ రోహిణి షాకింగ్ కామెంట్స్?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో రాణించాలి అంటే అంత సులభమైన విషయం కాదు. ఎంతోమంది భారీ సినీ బ్యాగ్రౌండ్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి.. అదృష్టం కలిసి రాక కనుమరుగైన వారు చాలామంది ఉన్నారు. హీరోల కెరియర్ ఎలా ఉన్నప్పటికీ హీరోయిన్ల కెరియర్ మాత్రం గందరగోళంగా ఉంటుంది. హీరోయిన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదగాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే ఒక వాదన ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూ వస్తుంది.

 కొత్తగా ఇండస్ట్రీస్ లోకి వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వాలంటే.. వాళ్లు ఏకంగా పక్కలోకి రావాల్సిందే లేదంటే అవకాశాలు దక్కవు అంటూ ఎంతో మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదే విషయంపై ఎంతోమంది నటిమణులు కూడా ఇక నోరు విప్పుతూ ఉంటారు అని చెప్పాలి. అంతేకాదు కెరియర్ తోలినాళ్లో ఏదైనా చేదు అనుభవాల గురించి షాకింగ్ విషయాలు చెబుతూ ఉంటారు. అయితే ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి జబర్దస్త్ నటి యాంకర్ రోహిణి సంచలన వ్యాఖ్యలు చేసింది.

 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జబర్దస్త్ రోహిణి ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ అంత సులభంగా రాలేదు. నాకే కాదు ఎవరికి అంత ఈజీగా ఛాన్సులు రావు. అవకాశాల కోసం చాలామంది దగ్గరికి వెళ్లాను. నాతో అసభ్యంగా మాట్లాడేవారు. కొంతమంది ఇన్ డైరెక్ట్ గా అడిగితే ఇంకొంతమంది డైరెక్ట్ గానే కమిట్మెంట్ అడిగేవారు. ఇక్కడ రాణించాలంటే టాలెంట్ ఉంటే మాత్రమే సరిపోదు. కమిట్మెంట్ కూడా ఇవ్వాలని తెగేసి చెప్పేసింది జబర్దస్త్ రోహిణి. వాళ్ళ మాటలతో చాలా బాధపడ్డాను. నా తండ్రి లాంటివాడని ఓ మూవీ ఆడిషన్ కి వెళ్లాను. నీకు అవకాశం ఇస్తే నాకేంటి అని అడిగాడు. నాకు కోపం వచ్చి అక్కడ నుంచి వచ్చేసాను. దీంతో నన్ను సినిమా నుంచి తీసేసారు. ఎన్ని కష్టాలు వచ్చినా టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి అని నమ్మకంతో ముందుకు సాగాలి అంటూ సూచించింది జబర్దస్త్ రోహిణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: