వసూళ్ల సునామి సృష్టిస్తున్న 'కల్కి' కి.. అక్కడ నష్టాలు తప్పేలా లేవే?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నఈ మూవీ ఇక వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అని చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది ఈ మూవీ.

 నైజాం, ఓవర్సీస్, కర్ణాటక లాంటి ఏరియాలలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలో ముందుకు దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా బ్లాక్ బస్టర్ సాధించి నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్న కల్కి మూవీ.. ఒక్కచోట మాత్రం కనీసం బ్రేక్ ఈవెన్ అయినా దాటుతుందో లేదా అని అనుమానం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే వారం రోజులు పూర్తయిన ఒక ప్రాంతంలో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ దాటలేకపోయింది కల్కి. అది ఎక్కడో కాదు ఆంధ్రాలో.ఆంధ్రాలో మొత్తంగా 109 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బలిలోకి దిగింది కల్కి మూవీ. ఇప్పటివరకు తొమ్మిది రోజులు పూర్తవ్వగా.. మొత్తంగా 71.93 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది.

 అంటే దీన్నిబట్టి కల్కి మూవీ ఆంధ్రాలో బ్రేక్ ఈవెంట్ దాటాలి అంటే ఇంకా 37.07 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది అని చెప్పాలి. అయితే రెండో వీకెండ్ గట్టిగా రాబడితే తప్ప ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు అని చెప్పాలి. అయితే సినిమా జోనర్ పెరిగిన తర్వాత టికెట్ రేట్లు పెరగడం, ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఆంధ్రాలో కలెక్షన్స్ బాగా తగ్గాయి అన్నది తెలుస్తోంది. మరోవైపు వచ్చేవారం కమల్ హాసన్ శంకర్ la భారతీయుడు 2 సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కనుక హిట్ టాక్ సొంతం చేసుకుంటే.. ఇక కల్కి సినిమాపై దెబ్బ పడినట్లే అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: