10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కల్కి పరిస్థితి ఇదే.. వీకెండ్ ఫుల్ గా ఉపయోగించుకున్నట్లే ఉందిగా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో సలార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , దిశ పటాని హీరోయిన్ గా నటించింది. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాల్ బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృణాల్ ఠాకూర్ చిన్న చిన్న పాత్రలలో నటించారు.

ఇక విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే వి ఈ సినిమాలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు. వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్ కూతురు స్వప్న దత్ ఈ మూవీ ని ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ లో లోక నాయకుడు కమల్ హాసన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు పది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ కి 10 వ రో మంచి కలెక్షన్ లు దక్కినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం పదవ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల నుండి 5.5 కోట్ల మీద షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒక వేళ ఈవినింగ్ షోస్ కి కలెక్షన్స్ భారీగా వచ్చినట్లు అయితే మరి కొంత ఈ కలక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: