కల్కి 2898 ఏడి సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నిన్నటితో ఏకంగా రూ. 865 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక హిందీలో కూడా 10 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 190 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆదివారం నాడు ఈ సినిమా బుకింగ్స్ జోరు చూస్తుంటే.. ఈజీగా ఈ రోజు కూడా రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి.మొత్తంగా ఈ రోజుతో బాలీవుడ్ లో 'కల్కి 2898ఏడి' సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ నటించిన రెండో చిత్రం రూ. 200 కోట్లు నెట్ ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ప్రభాస్ కాకుండా సౌత్ లో మరే హీరో సినిమా రెండోసారి రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టలేదు. సౌత్ సినిమాల్లో బాహుబలి 2, కేజీఎఫ్ 2 ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ లో రాబట్టాయి. ఇక బాహుబలి 2 సినిమా ఏకంగా రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధిస్తే.. కేజీఎఫ్ 2 సినిమా దాదాపు రూ. 430 కోట్ల నెట్ వసూళ్లు రాబడితే.. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం హిందీలో రూ. 245 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.ఇక రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఆరో సినిమాగా 'కల్కి 2898 ఏడి' మూవీ నిలిచింది. ప్రభాస్ నటించిన సినిమాల్లో నాలుగు సినిమాలు ఐదు వందల కోట్ల మార్క్ ని దాటిన మూవీస్‌గా నిలిచాయి.
బాహుబలి 2 రూ.1814కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ నిలిచింది. ఇది రూ.865 కోట్లు వసూలు చేసింది. బాహుబలి ` రూ.630 కోట్లతో మూడో స్థానంలో ఉంది. `సలార్ రూ.623కోట్లతో మూడో స్థానంలో ఉండగా, నాలుగు సినిమాలకు రూ.500కోట్లకుపైగా కలెక్షన్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు ప్రభాస్. నిజంగా ఇదొక అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. కలెక్షన్ల పరంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల విషయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌తో పోల్చితే ప్రభాస్ వెనకబడ్డాడు. ఆయన ఖాతాలో రెండు వెయ్యి కోట్లు దాటిని చిత్రాలు ఉన్నాయి. కేవలం షారూఖ్ కి మాత్రమే ఈ అరుదైన రికార్డు సాధ్యమైంది. అది కూడా గతేడాది లోనే కావడం విశేషం. ఆయన పఠాన్, జవాన్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీసులో దుమ్ములేపాడు.పఠాన్` చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1050కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించింది. ఆ తర్వాత వచ్చిన జవాన్ మరింతగా రచ్చ చేసింది.ఈ మూవీ ఏకంగా రూ.1148కోట్లు వసూలు చేసింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేశారు షారూఖ్. ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్రభాస్ కి సాధ్యమని తెలుస్తుంది. ఇప్పటికే కల్కి 865 కోట్లకు చేరిందంటే రెండో వారంలో ఇది వెయ్యి కోట్లు దాటుతుంది. ఈ లెక్కన ఇప్పుడు బాహుబలి 2 తర్వాత కల్కి చిత్రం వెయ్యి కోట్లు దాటిని సినిమాల జాబితాలో చేరుతుంది. ఓరకంగా ఇది షారూఖ్ రికార్డుని సమం చేయనుందని చెప్పాలి. మరి అది ఎన్ని రోజుల్లో సాధ్యమవుతుందో చూడాలి.