రికార్డ్ వసూళ్లతో నైజాంని దోచేస్తున్న కల్కి?

Purushottham Vinay

కల్కి 2898 ఏడి సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నిన్నటితో ఏకంగా రూ. 865 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.ఇక నైజాం ఏరియాలో దీనికి ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా అక్కడ ఈ సినిమాకి రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం కేవలం 8 రోజుల్లోనే రూ. 65 కోట్ల టార్గెట్‌ను చేరుకుని లాభాల్లోకి వచ్చేసింది.అక్కడ ప్రభాస్‌కు ఎక్కువ మార్కెట్ బాగా ఉండడంతో ఆ ఒక్క ప్రాంతంలోనే ఎక్కువ స్క్రీన్లలో ఇది విడుదలైంది. ఫలితంగా ఈ సినిమాకు నైజాంలో ఇప్పటి వరకూ రూ. 73 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.దీంతో ఈ గడ్డపై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. అదే సమయంలో వరుసగా రెండు సార్లు రూ. 70 కోట్లు షేర్ సాధించిన హీరోగా ప్రభాస్ రికార్డు సాధించాడు. గతంలో ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రంతో నైజాంలో రూ. 71.40 వసూలు చేసి రికార్డ్ కొట్టాడు.ఇదిలా ఇక హిందీలో కూడా  10 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 190 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది.


ఆదివారం నాడు ఈ సినిమా బుకింగ్స్ జోరు చూస్తుంటే.. ఈజీగా ఈ రోజు కూడా రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి.మొత్తంగా ఈ రోజుతో బాలీవుడ్ లో 'కల్కి 2898ఏడి' సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ నటించిన రెండో చిత్రం రూ. 200 కోట్లు నెట్ ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ప్రభాస్ కాకుండా సౌత్ లో మరే హీరో సినిమా రెండోసారి రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టలేదు. సౌత్ సినిమాల్లో బాహుబలి 2, కేజీఎఫ్ 2 ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ లో రాబట్టాయి. ఇక బాహుబలి 2 సినిమా ఏకంగా రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధిస్తే.. కేజీఎఫ్ 2 సినిమా దాదాపు రూ. 430 కోట్ల నెట్ వసూళ్లు రాబడితే.. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం హిందీలో రూ. 245 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: