సూపర్: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బర్తడే ట్రీట్ అదిరిపోద్దిగా..!

Divya
టాలీవుడ్ లో మోస్ట్ అవాయిడెడ్ కాంబినేషన్లో అభిమానులు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం SSMB -29. ఈ సినిమా కోసం ఎంతో మంది చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి వంటి డైరెక్షన్లో సినిమా అంటే ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు ఫ్లాపులు లేని డైరెక్టర్ గా పేరు సంపాదించిన రాజమౌళి.. మహేష్ తో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నానని అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పైన భారీ హైప్స్ పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటుంది. వచ్చే నెల 9వ తేదీన మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక కాన్సెప్ట్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు డ్యూయల్ రూల్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.. అలాగే ఇండోనేషియా ప్రాంతానికి చెందిన మోడల్ చెల్సియా  హీరోయిన్గా నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో కూడా మహారాజ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మరి అభిమానులు ఎంతగానో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న SSMB -29 చిత్రానికి సంబంధించి అప్డేట్ రావాలి అంటే కచ్చితంగా వచ్చేనెల తొమ్మిదవ తేదీ వరకు ఆగాల్సిందే.. మరి ఎలాంటి అభ్యర్థిని సైతం చిత్ర బృందం ఇస్తారా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు సినిమాని విడుదల చేసి పర్వాలేదు అనిపించుకున్నారు. దాదాపుగా రాజమౌళి సినిమాకి మూడేళ్లు సమయాన్ని కేటాయించినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను సైతం తిరగరాస్తుందో చూడాలి మరి. రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్ ప్రేక్షకులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: