మోక్షజ్ఞ తో రొమాన్స్ కి రెడీ అయిన కుర్ర హీరోయిన్..!?

Anilkumar
నటసింహం నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఎంతో కాలంగా వార్తలు వినబడుతున్న సంగతి మన అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తాడా అని ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే తాజాగా నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చే టైం రానే వచ్చిందని అంటున్నారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రస్తుతం అన్ని రకాల పనులను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం

 వినబడుతోంది. ఇప్పటికే మోక్షజ్ఞ కి సంబంధించిన పలు లుక్స్ సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోలను ఏమాత్రం తీసుకుపోనీ స్టన్నింగ్ లుక్ లో చాలా యంగ్ గా కనిపిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు మోక్షజ్ఞ. అయితే మొన్న ఆ మధ్యలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా చేశాడు. ఇక ఆ సమయంలో మోక్షజ్ఞ సైతం ఆ షూటింగ్ సెట్ లో కనిపించాడు.  అక్కడ సైతం నందమూరి మోక్షజ్ఞ చాలా యంగ్ గా డైనమిక్ లుక్ లో కనిపించాడు. అయితే తాజాగా

 ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ సిద్ధమైనట్లుగా సమాచారం వినబడుతుంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలకృష్ణ చాలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మా అబ్బాయ్ కూడా హీరోగా రాబోతున్నాడు.. యంగ్ హీరోల సలహాలు అతనికి కావలి అని ఓ స్టేజ్ పై అన్నారు. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ సీనియర్ దర్శకుడు తేజ డైరెక్షన్ లో ఉంటుందని కూడా పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు దర్శకుడు మారాడు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.  అన్ స్టాపబుల్ ప్రమోలు డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మ. ఆ సమయంలోప్రశాంత్ వర్కింగ్ స్టైల్ నచ్చి కొడుకు బాధ్యత అతని చేతిలో పెట్టాడట బాలయ్య. దాంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాగా మోక్షజ్ఞ పక్కన నటించే హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలను ఎంపిక చేశారని కూడా మాట్లాడుకుంటున్నారు. భగవంత్ కేసరి లో బాలయ్యతో కలిసి నటించింది శ్రీలీల. ఈ అమ్మడు అయితే మోక్షజ్ఞ పక్కన కరెక్ట్ గా సెట్ అవుతుందని.. పైగా క్రేజ్ ఉన్న బ్యూటీ కావడంతో కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: