లిప్ లాక్ సీన్ చేయమంటే బోరుమన్న ముద్దుగుమ్మ!
ఈ క్రమంలో కొంతమంది నటులు తాము ఎదుర్కొన్న అత్యంత కష్టమైన పరిస్థితులను గురించి అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు. తాజాగా అలాంటి అనుభవానికి సంబందించిన విషయం ఒకటి చెప్పుకొచ్చింది... ఓ ముద్దుగుమ్మ. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ శృతి శర్మ. అదేంటి బాలీవుడ్ కి ఇది కొత్తేమి కాదు కదా అనే అనుమానం మీకు కలగొచ్చు. కానీ అక్కడ కూడా కొంతమంది నటీమణులు అలాంటివి చేయడానికి కాస్త వెనక్కి జంకుతారు. వెండితెర మీద తమని తాము గా ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి సీన్ చేయమన్నా రెచ్చిపోతారు కొందరు. కానీ కొందరు మాత్రం తమ కెరీర్ మీద పూర్తి అవగాహనతో వారికి నచ్చినట్టుగానే చేస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే మడి కట్టుకు కూర్చుంటా అంటే కుదరని పని అనేది నగ్న సత్యం.
సరిగ్గా అలాంటి అనుభవం గురించి మాట్లాడుకొచ్చింది శృతి శర్మ. మొదట హిందీలో సీరియల్స్ చేస్తూ క్రేజ్ వచ్చాక... సిల్వర్ స్క్రీన్ పైన ఛాన్సులు అందుకుంది శృతి. గట్బంధాన్ సీరియల్ తో నటన మొదలు పెట్టిన శృతి శర్మ ఆ తర్వాత సినిమా అవకాశాలు చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే ఆమె సంజయ్ లీలా భన్సాలి తీసిన హీరామండి వెబ్ సీరీస్ లో చిన్న పాత్ర చేసింది. ఆ సీరీస్ లో ఆమెకి లిప్ లాక్ సీన్స్ ఉన్నాయట. తనకు ఇచ్చిన స్క్రిప్ట్ లో లిప్ లాక్ సీన్స్ ఉండడం చూసి ఈ ముద్దుగుమ్మ ఏడ్చేసిందట. ఐతే సంజయ్ లీలా భన్సాలి ఆమె ఇబ్బందిని గుర్తించి లిప్ లాక్స్ లేకుండానే షూటింగ్ చేశారని వినికిడి. ఈ విషయం తెలుసుకున్న సినిమా పండితులు అమ్మడు ఎప్పుడు ఇలానే ఉంటానంటే సినిమా ఛాన్సులు రావడం కష్టం కదా! అని పెదవి విరుస్తున్నారు.