రాజ్ తరుణ్ కు ఆ బిగ్ బాస్ నటితో కూడా సంబంధం ఉంది.. లావణ్య..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి రాజ్ తరుణ్ మరియు లావణ్య ప్రస్తుతం ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజ్ తరుణ్ నాకు 14 సంవత్సరాల నుండి పరిచయం , మేమిద్దరం 11 సంవత్సరాల నుండి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాం. మాల్వి వచ్చాక నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. ఇక ఆమె కూడా నన్ను చంపేస్తాను అని బెదిరించింది. వారిద్దరూ కలిసి ఒక హోటల్లో ఉన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. రాజ్ తరుణ్ అంటే నాకు ఎంతో ఇష్టం.

ఆయన లేకుండా నేను బ్రతకలేను అంటూ ఈమె చెప్పుకొస్తుంది. ఇక రాజ్ తరుణ్ ఈమె చెప్పేవన్నీ అబద్ధాలు అని కొట్టు పారిస్తూ వస్తున్నాడు. ఇకపోతే తాజాగా రాజ్ తరుణ్ పై లావణ్య మరికొన్ని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవు వైరల్ గా మారాయి. ఈమె గతంలోనే రాజ్ తరుణ్ మి అనేక మంది హీరోయిన్లతో సంబంధం ఉంది అని చెప్పుకుంటూ వస్తోంది. తాజాగా ఈమె , రాజ్ తరుణ్ కి ఒక బిగ్ బాస్ నటికి కూడా సంబంధం ఉన్నట్లు వెల్లడించింది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అరియనా  గ్లోరీ తో కూడా రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఉండేవాడు అని , కేవలం రాజ్ తరుణ్ ఆమెతో ఒకే ఒక రోజు షూట్ చేశాడు.

అంతలోనే ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను గోవా కి ఒక కోర్స్ కోసం మూడు నెలలు వెళ్లాను. నేను కోర్స్ కోసం వెళ్ళిన ఒక నెలలోపే ఇక్కడ అరియన గ్లోరీ తో మొదలు పెట్టాడు అని ఈమె తాజాగా మీడియాతో చెప్పకొచ్చింది. ఇక లావణ్య తాజాగా రాజ్ తరుణ్ , అరియన గ్లోరీ తో కూడా మాట్లాడేవాడు అని చెప్పడంతో ఇందులు సంబంధించిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక రాజ్ తరుణ్ , లావణ్య వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతుంది. మరి చివరికి ఇది ఏ దశకు చేరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: