10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీలు ఇవే.. కల్కి ఆ ప్లేస్ లో..?

Pulgam Srinivas
విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవి ..? అందులో కల్కి సినిమా ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 16.10 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది.
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.91 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.66 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.28 కోట్ల షేర్ కలక్షన్ వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది. ఈ సినిమాలో బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , దుల్కర్ సల్మాన్ , మృనాల్ ఠాకూర్ , శోభన , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , విజయ్ దేవర కొండ ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: