11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కల్కి విరవిహారం..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా ... రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , దుర్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , మృనాల్ ఠాకూర్ , శోభన ఈ మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దిశ పటని నటించగా ... ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే వి ఈ సినిమాలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు.

జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను కూడా అందుకుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఇక మరి ముఖ్యంగా ఈ సినిమాకు నిన్న అనగా ఆదివారం రోజు అద్భుతమైన కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి నిన్న ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్ లు వచ్చాయి అనే విషయం కచ్చితంగా తెలియకపోయినా భారీ మొత్తంలో మాత్రం కలెక్షన్లు ఈ మూవీ కి నిన్న వచ్చినట్లు తెలుస్తోంది.  ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన చాలా సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. పోయిన సంవత్సరం విడుదల అయిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుంది అని అంతా అనుకున్న ఈ సినిమా కూడా పర్వాలేదు అనే స్థాయి విజయంతోటే సరిపెట్టుకుంది. ఇక కల్కి మూవీ మాత్రం అద్భుతమైన విజయాన్ని ఇప్పటికే అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: