టాలీవుడ్ కామెడి స్టార్
అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
అల్లరి సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన
నరేష్ తన
కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..వరుసగా
కామెడీ సినిమాల్లో నటిస్తూ
కామెడీ స్టార్ గా గుర్తింపు పొందారు.
అల్లరి నరేష్ తనలో
కామెడీ యాంగిల్ మాత్రమే కాకుండా యాక్టింగ్ టాలెంట్ ను కూడా నిరూపించుకున్నారు.అయితే
అల్లరి నరేష్ గత కొంతకాలంగా నటిస్తున్న
కామెడీ సినిమాలు ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. దీనితో కామెడీని వదిలేసి సీరియస్ పాత్రలపై
అల్లరి నరేష్ మొగ్గు చూపారు. నాంది, ఉగ్రం వంటి సినిమాలలో సీరియస్ పాత్రలలో నటించి
నరేష్ ఎంతగానో మెప్పించారు.అయితే తెలుగు ప్రేక్షకులు
అల్లరి నరేశ్ లో
కామెడీ కంటే సీరియస్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు. నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిన సినిమాలన్నీ సీరియస్ రోల్సే కావడం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
త్వరలోనే 'బచ్చల మల్లి' గా మరో సీరియస్ రోల్‌లో
అల్లరి నరేశ్ కనిపించనున్నారు. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజేశ్ దండా,
బాలాజీ గుత్తా నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ
సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. నరేశ్ కెరీర్ లో ఇప్పటివరకూ చేయని మాస్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నారని,ఇంతకు ముందు ఎప్పుడు చూడని కొత్త అవతారంలో నరేశ్ ని డైరెక్టర్ సుబ్బు చూపిస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో
అమృత అయ్యర్
హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో రోహిణి, రావురమేశ్, అచ్యుత్‌కుమార్ వంటి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి
విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. .