వామ్మో.. వరలక్ష్మి శరత్ కుమార్ వెడ్డింగ్ కోసం అన్ని కోట్ల ఖర్చా.. దీంతో పాన్ ఇండియా సినిమా తీయొచ్చుగా..!?

Anilkumar
సినీ సెలబ్రిటీస్ పెళ్లి అంటే మామూలు విషయం కాదు. కోట్ల ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇప్పుడున్న చాలామంది సినీ స్టార్స్ అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలా వారి డెస్టినేషన్ వెడ్డింగ్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ఇక అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు కానీ చాలామంది వాటి గురించి ట్రోల్స్ సైతం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సైతం వెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.  ఆమె పెళ్లి అయినప్పటినుండి సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఖర్చుకి

 సంబంధించిన విషయాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ విషయానికి వస్తే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇకపోతే జూలై 2న  నికోలాన్ అనే వ్యక్తితో పెళ్లి బంధం లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. థాయిలాండ్ లో వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత చెన్నైలో ఎంతో ఘనంగా రిసెప్షన్ సైతం నిర్వహించారు. ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్ నటీనటులు. దీంతో ఆమె రిసెప్షన్ కి చాలామంది సినీ

 ప్రముఖులు వచ్చారు. ఇక నికోలాయ్ ఇది మొదటి పెళ్లి కాదు. ఇదివరకే పెళ్లయిన అతనికి ఇప్పటికే 15 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఇప్పుడు అతను వరలక్ష్మిని రెండవ పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్యకు నికోలాయ్ బంగారు చెప్పులు, డైమండ్లతో చేసిన చీర బహుమతిగా ఇచ్చారని.. వాటి విలువ సుమారు 200 కోట్లకు పైగా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కరలు కొడుతోంది. రిసెప్షన్ కి కూడా భారీగా ఖర్చు పెట్టారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు పెళ్లి ఖర్చు నిమిత్తం వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి సుమారు 200 కోట్లకు పైగా ఖర్చు చేశారు అన్న రూమర్ కూడా వినిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: