దీపిక కట్టుకున్న ఈ చీర తయారు చేయడానికి 3 వేల గంటల సమయం.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది..!?

Anilkumar
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే చాలా తక్కువ సమయంలోనే స్టార్డం సంపాదించుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో సైతం హీరోయిన్గా నటించి మెప్పించింది. ఇకపోతే  ఈ సినిమాలో తన నటనకు తెలుగు అభిమానులు అందరూ ఈమె ఫ్యాన్స్ అయిపోయారు. అయితే తాజాగా ఆమె ఒక ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే దీపికా పదుకొనే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం

 చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె షేర్ చేసిన ఫోటోలలో దీపిక పర్పుల్ కలర్ చీరలో మెరిసిపోయింది. అయితే ఈ ఫోటోను దీపికా పదుకొనే అనంత్ అంబానీ రాధిక సంగీత్ పార్టీ లో దిగిన ఫోటో అని తెలుస్తోంది. దీపికా పదుకొణె ధరించిన ఈ అందమైన పర్పుల్ కలర్ చీర లేబుల్ టోరానీ షెల్ఫ్‌ల నుండి డిజైన్ చేయబడింది. ఈ చీర యొక్క ఫాబ్రిక్ ఆర్గాన్జా మరియు జెన్నీ సిల్క్ చే తయారుచేయబడింది. అంతేకాదు ఈ చీర చేతితో ఎంబ్రాయిడరీ చేయగా..దీని తయారీకి దాదాపు 3,400 గంటలు పట్టింది. మరి ఇన్ని గంటల సమయం అంటే ఓ సారి అర్ధం చేసుకోవొచ్చు. 'హుకుమ్ కి రాణి చీర' ధర రూ.1

 లక్ష 92 వేలు ఉండగా..ఇందులో చీర ధర చూసుకుంటే, రూ.1,39,500, బ్లౌజ్ రూ.46,500. అండర్ స్కర్ట్ (పెట్టికోట్) ధర 7,500. దీంతో ఇన్ని అలంకారాలు..ఇంత భారీ ధర చీర ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ అరుదైన అందమైన చీరలో ముత్యాలు, జరీ మరియు తీగల అలంకరణలు ఎన్నో ఉన్నాయి. ఇవి చీరకు సొగసైన అందాన్ని ఇస్తూ..ఎంతో అట్రాక్షన్ గా నిలిచేలా చేశాయి. అదే సమయంలో, ఈ లుక్‌లో దీపికా పదుకొణె డీప్ నెక్‌లైన్, హాఫ్-లెంగ్త్ స్లీవ్‌లు మరియు కత్తిరించిన హేమ్‌తో మ్యాచింగ్ బ్లౌజ్ ధరించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: