ఇది అన్యాయం అంటూ మంచు విష్ణుకు లెటర్ రాసిన హేమ..??

Suma Kallamadi
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఇటీవల డ్రగ్స్, రేవ్‌ పార్టీ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు నటి హేమ "మా మెంబర్‌షిప్" క్యాన్సిల్ చేశారు. దాంతో హేమ ఫైర్ అయ్యింది. మా మెంబర్‌షిప్ నుంచి అలా ఎలా తొలగిస్తారు అంటూ మండిపడింది. ఎలాంటి షోకాస్ నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం అన్యాయం అన్నట్లు ఒక లేఖ కూడా రాసింది. తన మెంబర్‌షిప్‌ను దయచేసి రీస్టోర్ చేయాలని రిక్వస్ట్ చేసింది.

"మీడియా ఎలాంటి ప్రూఫ్స్‌ లేకపోయినా నాపై ఎన్నో అలిగేషన్స్ చేసింది. నేను దేశంలోనే హై స్టాండర్డ్స్ గల ఒక ల్యాబ్ లో బ్లడ్ టెస్ట్‌లు కూడా చేయించుకున్నా. ఆ పరీక్షల్లో డ్రగ్స్ తీసుకోలేదనే విషయం క్లియర్ గా ప్రూవ్ అయింది. పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు సైతం బయటకు వస్తాయి. వాటిలో కూడా నేను నిర్దోషిగా తేలతానని నమ్మకంగా చెబుతున్నా. ఇంకా పోలీసులు ఎలాంటి నిర్ధారణకు రాకముందే నన్ను దోషిగా భావించడం, బేసిక్ మెంబర్‌షిప్‌ను తొలగించటం, పరిణితి కలిగిన "మా" సంస్థకు తగదని కాదని నేను భావిస్తున్నా". అని లేఖలో హేమ రాస్కొచ్చింది. ఈ లెటర్‌తో పాటు తన మెడికల్ సర్టిఫికేట్లను కూడా అటాచ్ చేసి మంచు విష్ణుకు భయంగా అందించింది. చిరంజీవికి కూడా ఓ కాపీని సెండ్ చేసింది.
దుష్ప్రచారం వల్ల తీవ్రమైన మానసిక క్షోభకు లోనవుతున్నట్లు కూడా హేమ చెప్పింది. ఈ పరిస్థితులలో 'మా' అండగా ఉంటే బాగుంటుందని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. సుమారు 30 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్నా, ప్రజల అభిమానాన్ని పొందుతున్నా. కానీ దుర్మార్గమైన ప్రచారం వల్ల అనవసరంగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తోంది. వాటి నుంచి నన్ను రక్షించాలి. అది "మా" బాధ్యత. నాపై విధించిన సస్పెషన్‌ను తక్షణమే ఎత్తివేయాలి." అని హేమ రాసిన లెటర్‌లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: