సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది..ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ చేసారు. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు రాజమౌళి సినిమాకోసం మహేష్ తన లుక్ ను పూర్తిగా మార్చేసారు.లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో మహేష్ లుక్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది.రాజమౌళి, మహేష్ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై బ్యానర్ కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.రాజమౌళి మహేష్ తో బిగ్గెస్ట్ అడ్వెన్చరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ ఇప్పటికీ పూర్తి అయినట్లు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి భారీ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు ఓ స్పెషల్ ప్రెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఈ సినిమా స్టోరీకి సంబంధించి కీలక విషయాలు రాజమౌళి తెలియజేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.అందులోని ఓ పాత్ర నెగిటీవ్ షేడ్స్‌తో ఉంటుదని తెలుస్తుంది.అమేజాన్ అడవుల నేపథ్యంలోసాగే ఈ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని ఇన్‌సైడ్ టాక్. అలాగే మరో పాత్రలో మహేష్ ప్రపంచ యాత్రికుడిగా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ఆర్టిస్టుల ఎంపిక కోసం టెస్ట్ షూట్ జరుగుతున్నది. అలాగే డైలాగ్స్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారట. అలాగే హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది.