భయపడడానికి రెడీగా ఉండండి.. కాంచన 4 ..!?

Anilkumar
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన సిరీస్ ఎంతటి మంచి స్పందన అందుకున్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంతేకాదు కాంచన సిరీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ముని అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. 2007లో వచ్చిన ముని మంచి విజయాన్ని అందుకుంది. అయితే ముని సినిమా తర్వాత చాలా ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు రాఘవ లారెన్స్. ఆ తర్వాత 2011లో కాంచన అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఈ సినిమా కేవలం తెలుగులోనే

 కాకుండా తమిళంలో సైతం విడుదల చేయగా విశేష స్పందన అందుకుంది. రెండు భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఇందులో రాఘవ లారెన్స్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. కాంచన ఎండ్ లో సీక్వెల్ గా కాంచన -3ని ప్రకటించాడు. అందులో భాగంగానే కాంచనలో మూడవ భాగాన్ని 2015లో గంగా పేరుతో తీసుకువచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా అటు తమిళ్ ఇటు తెలుగులో విడుదల చేసి మంచి కలెక్షన్స్ రాబట్టాడు. ఆ చిత్రం ఎండ్ టైటిల్స్ లో కాంచన -4 రాబోతుందని రాఘవ లారెన్స్ అనౌన్స్ చేసాడు.  అది చాలా కాలంగా కార్యరూపం దాల్చలేదు. కాంచన సీరిస్ కు కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి.. పలు

 చిత్రాలలో హీరోగా నటించాడు లారెన్స్. కాగా లాంగ్ గ్యాప్ తర్వాత కాంచన -4ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు రాఘవ లారెన్స్. కాంచన -4 కు సంబంధించి కథ మొత్తం పూర్తైందని, ఈ సారి స్క్రిప్ట్ చాల బాగా వచ్చిందని, మునుపటి కంటే ఎక్కువ భయపెడతానని, ప్రేక్షకులను తప్పకుండా కాంచన -4 అలరిస్తుందని లారెన్స్ తాజాగా ఓ ఇంటర్వూలో తేలిపాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు ముగించి.. సెప్టెంబరు నాటికి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు చెన్నై సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: