టికెట్ రేట్ల తగ్గింపుతో పెరిగిన కల్కి కలెక్షన్స్.. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు లాభమంటే?

Purushottham Vinay

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకొని భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర  రూ. 900 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు మూవీ టీం అధికారికంగా తెలిపింది.  ఇక ఈ సినిమాకి ఇప్పటిదాకా 450 కోట్ల వరకు షేర్ వచ్చింది. 380 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా విడుదల అయ్యింది. మొదటి 5 రోజుల వరకు ఏపీ తెలంగాణలో కల్కి 10 కోట్ల షేర్ తక్కువ కాకుండా వసూళ్లు రాబట్టింది. ఇక 6వ రోజు నుంచి మెల్లమెల్లగా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. అయితే మళ్ళీ హఠాత్తుగా ఈ సినిమా 11వ రోజు 10 కోట్ల షేర్ ను అందుకోవడం విశేషం. సెకండ్ వీకెండ్ లో చాలా చోట్ల కూడా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. అందుకు ప్రధాన కారణం సినిమా టిక్కెట్ల రేట్లు చాలా వరకు తగ్గించడమే.సెకండ్ వీకెండ్ లో టికెట్ రేట్లు తగ్గించడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు బాగా గిట్టుబాటు అయ్యిందని చెప్పవచ్చు. ఇక నిర్మాత అదే రేంజ్ లో రేట్లు కొనసాగించి ఉంటే ఈ స్థాయిలో నెంబర్స్ పెరిగేవి కాదు. అలాగే నార్త్ లో కూడా సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగాయి. 


నార్త్ లో మొదటి రోజు 22 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకున్న కల్కి సినిమా ఆ తరువాత హెచ్చు తగ్గులను చూసింది. కానీ 11వ రోజు మాత్రం మళ్ళీ 22 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకోని ఇప్పటిదాకా 215 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకి ఇప్పటిదాకా 70 కోట్లు లాభాలు వచ్చాయి.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. పైగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరి సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. దీపికా పడుకోన్, దిశా పటాని లాంటి హాట్ హీరోయిన్లుగా నటించారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. మహాభారతన్ని రాబోయే ఫ్యూచర్ ని యాడ్ చేసి చూపించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నాడు. అశ్వాద్దామాగా అమితాబ్ ని చూపించిన తీరు అద్భుతం. అలాగే కామియో రోల్స్ ని కూడా నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా చూపించడంతో ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: