దేవర మూవీకి అదిరిపోయే ఆఫర్.. దీనితోనే అర్థం అవుతుంది ఎన్టీఆర్ క్రేజ్ అంటే ఏంటో..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో హిందీ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాతోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే ఈ సినిమాకు సంబంధించిన అన్ని భాషల ఓ టీ  టీ హక్కులను అత్యంత భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఇక ఇప్పటికే ఈ సంస్థ వారు ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడం దానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.

దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు అదిరిపోయే సూపర్ సాలిడ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇలా 110 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు రావడంతో ఇది ఎన్టీఆర్ రేంజ్ అని ఆయన అభిమానులు ఆనంద పడుతున్నారు. మరి ఈ సినిమాకు గనక హిట్ టాక్ వచ్చినట్లు అయితే 110 కోట్ల షేర్ కలెక్షన్ లను ఈ మూవీ అవలీలగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: