ప్రభాస్ ను డిసప్పాయింట్ చేసిన దిల్ రాజు.. ఒక్క మాటతో అంతా చేంజ్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన మొదటగా డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ను మొదలు పెట్టి అందులో మంచి సక్సెస్ ను సాధించి ఆ తర్వాత నిర్మాతగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈయన దిల్ మూవీ తో నిర్మాతగా కెరియర్ ను మొదలు పెట్టి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటి నుండి ఈయన ఇండస్ట్రీ లో దిల్ రాజు గా పేరు సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన నిర్మాతగా కెరియర్ ను మొదలు పెట్టిన కొత్తలో కథను ఎంచుకొని అందుకు నటీనటులను ఎంచుకొని ఆచి చూచి దర్శకులను ఎంచుకొని సినిమాలను తెరకెక్కిస్తూ వచ్చాడు. దానితో ఈయన కెరియర్ ప్రారంభంలో తెరకెక్కించిన దాదాపు చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం దిల్ రాజు , ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మున్నా అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా గురించి దిల్ రాజు తాజాగా అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. మున్నా సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ ... మా బ్యానర్ లో ప్రభాస్ హీరోగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో మున్నా అనే మూవీ ని రూపొందించాం. ఇక సినిమా విడుదల అయ్యింది. యావరేజ్ టాక్ వస్తుంది. నాకు కూడా ఆ సినిమా చూశాక ఈ సినిమా యావరేజ్ అవుతుంది , బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ లేదు అనిపించింది. అదే విషయాన్ని ప్రభాస్ తో షేర్ చేసుకుందాం అని వాళ్ళ ఇంటికి వెళ్లాను.

అప్పటికే ప్రభాస్ సినిమా సూపర్ హిట్ అయింది అనే జోష్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నాడు. ఆ సమయంలో నేను ప్రభాస్ దగ్గరకు వెళ్లి సినిమా యావరేజ్ అవుతుంది అని అన్నాను. మీరు ఏంటి సార్ అలా అంటున్నారు... సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అని ప్రభాస్ అన్నాడు. నేను అతనితో నువ్వు బ్లాక్ బాస్టర్ అని పిక్స్ కాకు... ఇది యావరేజ్ అవుతుంది ... మహా అయితే ఎబో యావరేజ్ అవుతుంది అంతే అని చెప్పాను చివరకు అదే జరిగింది అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

dr

సంబంధిత వార్తలు: