అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను.. డైరెక్టర్లకు హింట్ ఇచ్చిన అనుపమ..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ నటి మణులతో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ లో తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ బ్యూటీ కి ఆ తర్వాత తెలుగు లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇందులో ఈమె కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు పెరిగాయి. ఇకపోతే ఈ బ్యూటీ కొన్ని సందర్భాలలో అభజాయలను ఎదుర్కొన్న మళ్ళీ విజయాలను అందుకుంటు ముందు వరుస లోకి వచ్చేస్తుంది. కొంత కాలం క్రితం ఈ నటి హీరోయిన్ గా రూపొందిన కార్తికేయ 2 మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత ఈమె కొన్ని సినిమాలలో నటించిన అవి మంచి స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఇందులో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఈమె కట్టిపడేసింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మకు ఒక డ్రీమ్ రోల్ ఉందట. తాజాగా ఈమె మాట్లాడుతూ ... ఈమెకు అదిరిపోయే ఫుల్ లెన్త్ నెగిటివ్ రోల్ చేయాలి అని ఆశగా ఉందట. ఇక ఇప్పటికే ఈమె అ ఆ , టిల్లు స్క్వేర్ మూవీలలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకపోతే ఈమెకు ఫుల్ లెన్త్ నెగటివ్ పాత్రలో నటించాలని ఆశగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి ఏ దర్శకుడు అయినా ఈమెను ఫుల్ లెన్త్ నెగిటివ్ పాత్రలో చూపిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: