షాకింగ్! శంకర్ బ్లాక్ బస్టర్ మూవీ హిందీ రీమేక్ పై దిమ్మతిరిగే అప్డేట్?

Purushottham Vinay
 

సౌత్ సినిమాలకి బాలీవుడ్ లో మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి. అందుకే సౌత్ లో హిట్స్ కొట్టిన సినిమాలని బాలీవుడ్ లో నిర్మాతలు, డైరెక్టర్లు రీమేక్స్ చెయ్యాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో అయిన రణ్‌వీర్ సింగ్‌ హీరోగా శంకర్ తన బ్లాక్ బస్టర్ అపరిచితుడు రీమేక్ ను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. కొన్ని మార్పులు చేర్పులు చేసి హిందీ ప్రేక్షకులకు అపరిచితుడను చేరువ చేయవచ్చు అని దర్శకుడు శంకర్‌ భావించాడు. పైగా ఎప్పుడో రెండేళ్ల క్రితమే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించడం కూడా జరిగింది. కానీ గత కొన్నాళ్ల నుంచి సినిమా గురించి ఎలాంటి హడావుడి లేక పోవడంతో సినిమా రద్దు అయ్యిందని అంతా కూడా భావిస్తున్నారు. తాజాగా ఆ విషయమై దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా ప్రమోషన్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. హిందీలో అపరిచిత్ సినిమా చేయాలని మేం అనుకున్నాం. 


ఇక అందుకు సంబంధించిన ప్రకటన కూడా చేశాం. కానీ అపరిచిత్ కంటే ఇంకా పెద్దగా ఏమైనా చేయాలని మా నిర్మాతలు నన్ను కోరుతున్నారు.ప్రస్తుతానికి ఇండియన్‌ 2 సినిమా పైనే తమ దృష్టి ఉందని, ఆ తర్వాత ఇండియన్‌ 3 తో రాబోతున్నట్లుగా డైరెక్టర్ శంకర్ పేర్కొన్నాడు. ప్రస్తుతానికి తదుపరి సినిమా విషయంలో ఎలాంటి ఆలోచన లేదని, గేమ్‌ ఛేంజర్ సినిమా కూడా విడుదల అయిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుంది అన్నట్లుగా శంకర్ చెప్పుకొచ్చాడు.జులై 7 వ తేదీన భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి ఇంకా అలాగే సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. మూవీ యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్‌ ఇంకా ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: