ఫారియ : ఫస్ట్ సినిమాతో ఫుల్ క్రేజ్.. ఆ తర్వాత మాత్రం కెరియర్ లో అలాంటి మలుపులు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను , అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో పొడుగు కాళ్ళ సుందరి ఫరియ అబ్దుల్లా ఒకరు. ఈమె జాతి రత్నాలు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం ఇందులో ఈమె చిట్టి పాత్రలో నటించి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది.

ఇక ఆ తర్వాత ఈమెకు సినిమాలలో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇక సినిమాలలో హీరోయిన్ అవకాశాలు మాత్రమే కాకుండా ఈమెకు ఐటెం పాత్రలలో కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నాగార్జున , నాగచైతన్య హీరోలుగా రూపొందిన బంగార్రాజు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో కూడా నటించి తన డాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే రవితేజ హీరో గా రూపొందిన రావణాసుర సినిమాలో ఈమె ఒక చిన్న పాత్రలో నటించింది. ఇక ఈమె ఇప్పటికే కెరియర్ ను మొదలు పెట్టి కొద్ది కాలమే అవుతున్న అంతలోనే హీరోయిన్ గాను , కీలకపాత్రలోనూ ,  ఐటమ్ సాంగ్ లలో కూడా నటించింది.

కాకపోతే ఈమెకు జాతి రత్నాలు సినిమాతో వచ్చిన విజయం , గుర్తింపు మాత్రం వేరే సినిమాతో కూడా రాలేదు. కొన్ని రోజుల క్రితమే ఈమె అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అయిన ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ విజయం అందుతుందేమో అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈ సినిమా కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దు గుమ్మ మంచి విజయాలను అందుకొని ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: