మీడియా ఎప్పుడూ బాలీవుడ్ నటుల పై ఓ కన్నేసి ఉంటుంది. ఇక వీరిలో ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ వార్తల్లో ఉండే పేరు. ఉర్ఫీ జావేద్‌కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం చాలా కష్టం. ఉర్ఫీ జావేద్ తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది.కొద్దిరోజులుగా వేరే కారణాలతో ఉర్ఫీ వార్తలలో నిలుస్తుంది. ఇటీవల ఆమె ఎక్కువగా తాగి కనిపిస్తుంది. వారాంతంలో సండే వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. అయితే పార్టీ ముగించుకుని ఉర్పీ బయటకు వచ్చిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఉర్ఫీ జావేద్‌కి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే ఎవరైనా సాయంగా పట్టుకోకపోతే కిందపడిపోయే విధంగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఓ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉర్ఫీ జావేద్‌ను ఆమె స్నేహితురాళ్లు నడిపించారు. తన స్నేహితుల సాయంతో ఉర్ఫీ జావేద్ మెల్లిగా ముందుకు నడించింది. అలాగే వారి వదిలేస్తే కింద పడిపోయేలా కనిపించింది. మద్యం మత్తులో ఉన్న ఉర్ఫీ జావేద్‌ను ఆమె స్నేహితులు సురక్షితంగా తీసుకొచ్చి కారులో కూర్చొపెట్టారు. ఈ వీడియో చూసిన చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై కొందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉర్ఫీ జావేద్ నిజంగా తాగిందా? తాగినట్లు నటిస్తుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఆమె కళ్లను చూస్తే మద్యం తాగినట్లు కనిపించడం లేదని..కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే మరో విషయం తెలుస్తుంది. ఉర్ఫీ జావేద్ పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు మొదటి నాలుగు అడుగులు సరిగ్గానే వేసింది. కానీ ఆ తర్వాత ఫోటోగ్రాఫర్స్ ఉన్నారని గ్రహించిన తర్వాత ఆమె తూలుతున్నట్లు నటించింది. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.