ఒక్క రోజే ఏకంగా అన్ని సినిమాలు.. కానీ పోటీ ఆ రెండు సినిమాల మధ్యే..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో ఏదైనా లాంగ్ వీకెండ్ వచ్చింది అంటే చాలా మూవీ బృందాలు అదే తేదీన ఆ సినిమాను విడుదల చేయాలి అనుకుంటారు. దాని వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలకు పోటీ ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే చాలా రోజుల క్రితం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ తేదీ దగ్గరకు ఎవరు రాలేదు. ఇక ఈ సినిమా ఎప్పుడు అయితే పోస్ట్ పోన్ అయ్యిందో అప్పటి నుండి అన్ని సినిమాలు ఈ తేదీ పై పడిపోతున్నాయి.

ఇక ఇప్పటికే రామ్ పోతినేని హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ ని ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు  ఆ తర్వాత తమిళ సినిమా అయినటువంటి కంగువా మూవీ ని కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన ‘ఆయ్’, నివేదా థామస్  ’35’ వంటి చిత్రాలు కూడా అదే డేట్ కి అనౌన్స్ చేశారు. ఈ మూవీ లతో పాటు ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ మూవీ ని కూడా ఇదే తేదీన రిలీజ్ చేయాలి అని ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరో ఒకటి , రెండు రోజుల్లో రాబోతున్నట్లు సమాచారం. ఈ తేదీన చాలా సినిమాలు విడుదల కానున్న తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డబల్ ఈ , మిస్టర్ బచ్చన్ మూవీ లకే క్రేజ్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ప్రేక్షకులు ఈ రెండు మూవీ లలో ఏదో ఒక మూవీ నే చూస్ చేసుకుంటారు. దానితో ఈ రెండు మూవీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: