సినిమాల్లో.. ఇకనుండి అలాంటి డైలాగ్స్ ఉండొద్దు : సుప్రీంకోర్టు
ఇప్పటివరకు చాలా సినిమాల్లోనే వైకల్యం ఉన్న వారిని చూపిస్తూ.. బాడీ షేమింగ్ చేసే విధంగా ఎగతాళి చేసే డైలాగ్స్ ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ ఇకనుంచి సినిమాలో అలాంటి డైలాగ్స్ పెట్టారు అంటే చాలు ఇక ఆ చిత్ర బృందం ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున గాని లేదంటే ఉద్దేశపూర్వకంగా గాని సినిమాలో వైకల్యం కలిగిన వారిని ఎగతాళి చేసే విధంగా డైలాగ్స్ పెట్టారు అంటే ఇక పోలీసులు చర్యలు తీసుకునెందుకు సిద్ధమవుతూ ఉంటారు. ఎందుకంటే ఇదే విషయంపై ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
సినిమాలలో దివ్యాంగులను కించపరిచే సీన్స్ ఉండడానికి అస్సలు వీల్లేదు అంటూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అవిటివాడు, స్పాస్టిక్ వంటి పదాలు సామాజిక వివక్షకు దారితీస్తాయి అంటూ అభిప్రాయబడింది సుప్రీంకోర్టు. అంఖ్ మెచోలి అనే హిందీ సినిమాలో దివ్యాంగుల్ని కించపరిచే విధంగా సీన్స్ ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అయితే ఇలాంటి సన్నివేశాలు కానీ డైలాగులు గాని ఉంటే సినిమా విడుదలకు ముందే ఇక సెన్సార్ బోర్డు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలి అంటూ సూచించింది సుప్రీంకోర్టు.