బాలయ్య మూవీ కోసం వాల్టేరు వీరయ్య ను ఫాలో అవుతున్న బాబి..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన పవర్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఈయన సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవకుశ , వెంకీ మామ , వాల్టేర్ వీరయ్య సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో పవర్ జై లవకుశ , వాల్టర్ వీరయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూవీలతో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు కూడా లభించింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా యొక్క షూటింగ్ ను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ ను రివిల్ చేసే విషయంలో దర్శకుడు బాబి తన గత సినిమా అయినటువంటి వాల్తేరు వీరయ్య ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే చిరంజీవి తో బాబీ మూవీ అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే బాబీ ఈ సినిమా కోసం వాల్టేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.

కానీ ఆయన అందుకు సంబంధించి అధికారిక ప్రకటనను సినిమా విడుదలకు చాలా తక్కువ రోజుల ముందే విడుదల చేశాడు. ఇక బాలయ్య సినిమాకు కూడా ఈయన కొన్ని టైటిల్స్ అనుకుంటున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈయన ఈ సినిమాకు సంబంధించిన రెండు గ్లిమ్స్ వీడియోలను విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ ను మాత్రం రివీల్ చేయలేదు. దానితో ఈయన వాల్టేరు వీరయ్య సినిమా ఫార్ములాను ఫాలో అయ్యి NBK 109 మూవీ విడుదలకు చాలా తక్కువ రోజుల ముందు ఈ సినిమా యొక్క టైటిల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: