ఇండియన్ 2 : కమల్ పాత్ర మరీ అంత తక్కువా..?
తాజాగా వీటిపై ప్రమోషనల్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు శంకర్. కమల్ హాసన్ సార్ స్క్రీన్ టైం ఫుల్‌గా ఉంటుంది. ఆయన స్క్రీన్‌పై కనిపించకున్నా సినిమాలోని ఇతర పాత్రలు ఆయన గురించి మాట్లాడతాయి. ఇది ఉలగనాయగన్ సినిమా అంటూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశాడు శంకర్. అవినీతి, లంచం బ్యాక్‌డ్రాప్ స్టోరీతో సాగే ఈ చిత్రం ఆల్‌టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోందని తెలిసిందే.
ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఐదేళ్ల క్రితమే మొదలైంది. అయితే, వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఉండదేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, మళ్లీ గతేడాదిలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కింది. ఇండియన్ 3 కూడా తీసుకురావాలని శంకర్ డిసైడ్ అయ్యారు.