భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. బాలకృష్ణ-బాబీ దర్శకత్వంలో వస్తున్న NBK 109 మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశితో పాటుగా యానిమల్ విలన్ బాబీ డియోలు, చాందిని చౌదరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SS థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య బర్త్ డే కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ షూటింగ్లో
ఊర్వశి తీవ్రంగా గాయపడిందని.. దాంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశికి ఫ్రాక్చర్ అయ్యిందని.. అప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీమ్ తెలిపింది. #NBK109 మూవీ మూడో షెడ్యూల్ కోసం ఊర్వశి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిందని ఆమె బృందం పేర్కొంది. ప్రస్తుతం ఊర్వశి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్ని ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ మూవీ మూడో షెడ్యూల్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా హైదరాబాద్
వచ్చింది. ఈ చిత్రంలో ఊర్వశీ కీలక పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశీ తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఇక 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన ఊర్వశి రౌతేలా ఇప్పుడు నందమూరి నయకుడితోను రేర్ ఛాన్స్ దక్కించుకుంది. ఇది బాలయ్య ఫ్యాన్స్ లో ఎక్స్ ట్రా ఎనర్జీని నింపే ప్రయత్నం అనడంలో సందేహం లేదు. ఇంతకుముందు ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్ లో NBK 109లో తన పాత్రను ధృవీకరిస్తూ జిమ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి...!!