సింహాద్రి మూవీకి మొత్తం ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో సింహాద్రి మూవీ ఒకటి. ఈ సినిమాకు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో భూమిక , అంకిత హీరోయిన్ లుగా నటించగా , వి దొరస్వామి రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి v VIJAYENDRA PRASAD' target='_blank' title='విజయేంద్ర ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. 
ఈ మూవీ 2003 వ సంవత్సరం జూలై 9 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది. ఇక ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి. మరి ఈ మూవీ కి ఆ సమయంలో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి మొత్తంగా ఎన్నికలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 7.17 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 6.03 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.55 కోట్లు , ఈస్ట్ లో 1.89 కోట్లు , వెస్ట్ లో 1.77 కోట్లు , గుంటూరు లో 2.36 కోట్లు , కృష్ణా లో 2.02 కోట్లు , నెల్లూరు లో 1.37 కోట్లు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమాకు 25.16 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని 3.07 కోట్లు. ఇక మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 28.23 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 11.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ 25.40 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టి 13.9 కోట్ల లాభాలను అందుకొని ఆ సమయంలో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: