బాక్సాఫీస్ వేటకు సిద్దమైన కమల్ హాసన్.. భారతీయుడు 2 బుకింగ్స్ షురూ..!!
భారీ లెవల్ లో ప్రీ బుకింగ్స్ జరుగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…సినిమా ఓవర్సీస్ లో ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా ఓవర్సీస్ లోనే ఆల్ మోస్ట్ 8.5 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని భారతీయుడు2 మూవీ మాస్ రాంపెజ్ ను స్టార్ట్ చేసింది ఇప్పుడు.ఇక తమిళనాడు సినిమా బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవ్వగా అక్కడ మాత్రం బుకింగ్స్ ఆశించిన స్పీడ్ తో అయితే స్టార్ట్ అవ్వలేదు….అక్కడ సూపర్ ఫాస్ట్ తో బుకింగ్స్ జోరు చూపుతుంది అనుకున్నా ఓవరాల్ గా 2 కోట్ల రేంజ్ లోనే బుకింగ్స్ జరగగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో…లిమిటెడ్ గా బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి…కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలతో 11 కోట్ల ప్రీ బుకింగ్స్ గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…ఇండియాలో సినిమా కి ఇప్పుడు పాజిటివ్ టాక్ చాలా అవసరం అని చెప్పాలి…టాక్ పాజిటివ్ గా ఉంటే ఇక్కడ కూడా సినిమా రచ్చ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా భారతీయుడు2 మూవీ సాలిడ్ ఓపెనింగ్స్ ను ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.