విడాకులు తీసుకున్న తర్వాత ఆ సర్జరీ చేయించుకున్న మెగా డాటర్ ?
ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ని ఏర్పాటు చేసి.... నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ బ్యానర్ లో నాన్న కూచి, ముద్దపప్పు ఆవకాయ్ వంటి పలు వెబ్ సిరీస్ లను చేసింది. ఇక రీసెంట్ గానే కమిటీ కుర్రోళ్ళు సినిమాని నిర్మించింది నిహారిక. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నిహారిక వైట్ షర్ట్ ధరించి కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోల్లో షర్ట్ మడత పెట్టి సింపుల్ గానే క్యూట్ లుక్స్ ఇచ్చింది.
కానీ ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమంలో హీట్ పెంచుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసి నిహారిక అభిమానులు కొంతమంది మురిసిపోతుంటే.... నిహారిక అంటే పడని వారు మాత్రం నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. తన పెదవికి సర్జరీ చేయించుకున్నట్టు ఉందని.... సర్జరీ చేయించుకోవడం అవసరమా.....నేచురల్ గానే అందంగా ఉండొచ్చు కదా అని నెగిటివ్గా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.