విలన్ వేషాలపై మొగ్గు చూపుతున్న టాప్ హీరో?
మలయాళ టాప్ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా ఫహద్ ఫాసిల్ లు ఒక వైపు హీరోలుగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ పాత్రల్లో ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తూ పాన్ ఇండియా స్టార్ నటులుగా మంచి గుర్తింపు దక్కించుకుంటున్నారు.ఫహద్ ఫాసిల్ తాజాగా మరో మూవీలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పుష్ప సినిమాలో ఫహద్ పోషించిన పాత్రకు చాలా మంచి మార్కులు పడ్డాయి. పుష్ప 2 మూవీలో అంతకు మించి అన్నట్లుగా ఆయన పాత్ర ఉండబోతుంది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాలో కూడా ఫహద్ నటించేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి 'వెట్టాయన్' సినిమాలో నటిస్తున్న ఫహద్ ఇంకా ఆ సినిమా విడుదల కూడా అవ్వకుండానే కూలీ సినిమాలో కూడా నటించేందుకు ఓకే చెప్పాడని తమిళ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఒక వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న ఫహద్ ఇలా ఇతర హీరోల సినిమాల్లో కూడా విలన్ వేషాలు వేయాల్సిన అవసరం ఏంటంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆవేశం మూవీతో ఏకంగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఫహద్ హీరోగా కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయినా కూడా తను విలన్ వేషాలు ఇంకా ముఖ్య పాత్రల్లో నటించడం మాత్రం మానుకోవడం లేదు. హీరోగా కంటే కూడా ఎక్కువగా నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు హీరో ఫహద్ ప్రయత్నిస్తున్నాడు. మలయాళంతో పాటు అన్ని భాషల సినిమాల్లో కూడా హీరోగానే కాకుండా మంచి పాత్రతో వస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు రెడీ అన్నట్లుగా ఫహద్ గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అలా అన్నట్లుగానే వరుసగా ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలను చేస్తూ ముందుకు వస్తున్నాడు ఫహాడ్ ఫాజిల్.