ట్రైలర్: నెక్స్ట్ లెవెల్ లో విక్రమ్ యాక్టింగ్.. హైప్ పెంచేశారుగా..

Divya
కోలీవుడ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో చియాన్ విక్రమ్ ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో పాత్రలతో ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటూ ఉంటారు. ఎన్నో చిత్రాలకు తన ప్రాణాలను రిస్క్ పెట్టి మరి నటించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ తంగలాన్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమాని షూటింగ్ చేస్తున్నప్పటికీ తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఒక యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. పార్వతి తిరువోతూ, మాళవికా మోహన్ ఇందులో కథానాయకులుగా నటిస్తూ ఉన్నారు. స్టూడియో గ్రీన్ ఫీలింగ్స్ బ్యానర్ పైన జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం జరుగుతోంది.పాన్ ఇండియా లెవెల్ లో ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.. ఇందులో విక్రమ్ ఒక అటవీ తెగకు చెందిన వ్యక్తిగ కనిపించారు.

ముఖ్యంగా చాలా వైవిధ్యంగా తన నటనతో ప్రేక్షకులను మరొకసారి ఆకట్టుకుంటున్నారు విక్రమ్.. తన బాడీ షేప్ ని మార్చడమే కాకుండా.. యాక్టింగ్ స్కిల్స్ తో అందరిని అదరగొట్టేసారని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉన్నది.అలాగే ట్రైలర్లు విక్రమ్ మాంత్రికురాల్లుని ఎదుర్కొంటున్న సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తున్నాయి.. మొత్తానికి తంగలాన్  ట్రైలర్ నెక్స్ట్  లెవెల్ లో ఉందని చెప్పవచ్చు మరి ఏ మేరకు ఈ సినిమాతో విక్రమ్ సక్సెస్ ని అందుకుంటారో చూడాలి మరి. విక్రమ్ ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించిన సరైన సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నారు.. మరి తంగాలాన్ సినిమా అయినా విక్రమ్ కెరీర్ ని మలుపు తిప్పుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: